45 ఏళ్ల మహిళను మింగేసిన భారీ పైతాన్!

ఇండోనేషియాలో ఓ మహిళను భారీ పైతాన్ మింగేసింది.పోలం పనుల నిమిత్తం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆ మహిళ తిరిగి రాలేదు.దీంతో భర్త ఇంటి చుట్టుపక్కల వారితో గాలింపు చర్యలు చేపట్టాగ..పొలానికి సమీపంలో ఓ భారీ పైతాన్ నోట్లో తన భార్య ఆనవాళ్లను అతడు కనిపెట్టాడు.

New Update
45 ఏళ్ల మహిళను మింగేసిన భారీ పైతాన్!

ఇండోనేషియాలో ఓ  సంఘటన  మొత్తం ప్రాంతాన్ని కదిలించింది. మకస్సర్ గ్రామానికి చెందిన ఓ మహిళ పని నిమిత్తం పొలాలకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆ తర్వాత ఆమె భర్త,చుట్టుప్రక్కల వారితో  వెతకడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ మహిళను పోలానికి సమీపంలో  ఓ భారీ పాము సజీవంగా మింగివేసినట్టు  గుర్తించారు. 45 ఏళ్ల ఫరీదా భర్త ,దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామ నివాసితులుగా ఉన్నారు. శుక్రవారం 16 అడుగుల ఉన్న పెద్ద కొండచిలువ కడుపులో ఆమెను భర్త,స్థానికులు గుర్తించినట్టు స్థానిక అధికారి శనివారం తెలిపారు.

స్థానికి అధికారి మాట్లాడుతూ..భార్యకోసం వెతుకుతున్న సమయంలో భర్తకు ఆమె అటుగా వెళ్లిన ఉన్న ఆనవాళ్లు కనిపించాయని.. దీంతో అతనికి  అనుమానం వచ్చి అటుగా వెతికారని చీఫ్ చెప్పారు.వెంటనే వారికి పెద్ద కొండచిలువ కదలలేని పరిస్థితిలో కనిపించిందని ఆ భారీ పైతాన్ కడుపు చీల్చి చూడగా తన భార్య కనిపించిందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు