Market Cap: ఆ ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది.. టాప్ లో ఎస్బీఐ

గత వారం స్టాక్ మార్కెట్ మొత్తంగా చూసుకుంటే లాభపడింది. ఇదేసమయంలో దేశంలోని టాప్ 10 కంపెనీల్లో ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. వీటిలో ఎస్బీఐ మార్కెట్ క్యాప్ భారీగా పెరగడంతో చార్ట్ లో మొదటి స్థానంలో ఉంది. గతవారంలో మార్కెట్ క్యాప్ వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు. 

Market Cap: ఆ ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది.. టాప్ లో ఎస్బీఐ
New Update

గత ట్రేడింగ్ వారంలో, మార్కెట్ క్యాపిటలైజేషన్(Market Cap) పరంగా దేశంలోని టాప్ 10 కంపెనీల్లో 6 కంపెనీల మార్కెట్ క్యాప్ మొత్తం ₹ 1,30,734.57 కోట్లు (₹ 1.30 లక్షల కోట్లు) పెరిగింది. ఈ కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్‌లో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్(Market Cap) ₹45,158 కోట్లు పెరిగి ₹7.15 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది కాకుండా, ICICI బ్యాంక్ - భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్(Market Cap) కూడా వరుసగా ₹28,726.33 కోట్లు - ₹20,747.99 కోట్లు పెరిగి ₹7.78 లక్షల కోట్లు - ₹7.51 లక్షల కోట్లకు చేరుకుంది.

పడిపోయిన రిలయన్స్ మార్కెట్ విలువ..
అయితే టాప్-10లో ఉన్న 4 కంపెనీల మార్కెట్ విలువ(Market Cap) ₹ 50,295 కోట్లకు తగ్గింది. దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ ₹26,115.56 కోట్లు తగ్గి ₹19.64 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్‌తో పాటు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్,హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ విలువలో క్షీణత ఉంది.

గత వారం స్టాక్ మార్కెట్ పెరిగింది..
స్టాక్ మార్కెట్ గత వారంలో 641.83 పాయింట్లు లేదా 0.87% పెరిగింది. ఇదే సమయంలో వారం చివరి ట్రేడింగ్ రోజైన ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్ లో క్షీణత కనిపించింది. సెన్సెక్స్ 609 పాయింట్ల పతనంతో 73,730 వద్ద ముగిసింది.అదే సమయంలో, నిఫ్టీ కూడా 150 పాయింట్లు క్షీణించి, 22,419 స్థాయి వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 23 క్షీణించగా, 7 వృద్ధి చెందాయి.

మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే..
మార్కెట్ క్యాప్(Market Cap) అనేది ఏదైనా కంపెనీ మొత్తం బకాయి షేర్ల విలువ.  అంటే ప్రస్తుతం దాని వాటాదారుల వద్ద ఉన్న అన్ని షేర్లు విలువగా చెప్పవచ్చు. కంపెనీ జారీ చేసిన మొత్తం షేర్ల సంఖ్యను స్టాక్ ధరతో గుణించడం ద్వారా దీనిని లెక్కిస్తారు. 

పెట్టుబడిదారులు తమ రిస్క్ ప్రొఫైల్ ప్రకారం పెట్టుబడి పెట్టడం కోసం కంపెనీని ఎంచుకోవడంలో సహాయపడటానికి కంపెనీల షేర్లను వర్గీకరించడానికి మార్కెట్ క్యాప్(Market Cap) ఉపయోగపడుతుంది. మార్కెట్ క్యాప్ ఆధారంగా కంపెనీలను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్,స్మాల్ క్యాప్ కంపెనీలుగా వర్గీకరిస్తారు. 

మార్కెట్ క్యాప్ = (బాకీ ఉన్న షేర్ల సంఖ్య) x (షేర్ల ధర)

Also Read: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. 

మార్కెట్ క్యాప్ ఎలా పని చేస్తుంది?
కంపెనీ షేర్లు లాభాన్ని ఇస్తాయా లేదా అనేది అనేక అంశాలను పరిశీలించి అంచనా వేస్తారు. ఈ అంశాల్లో ఒకటి మార్కెట్ క్యాప్(Market Cap). పెట్టుబడిదారులు మార్కెట్ క్యాప్‌ను చూడటం ద్వారా కంపెనీ ఎంత పెద్దది అని తెలుసుకోవచ్చు. కంపెనీ మార్కెట్ క్యాప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి కంపెనీగా పరిగణిస్తారు. డిమాండ్ - సరఫరా ప్రకారం స్టాక్ ధరలు పెరుగుతాయి- తగ్గుతాయి. కాబట్టి, మార్కెట్ క్యాప్(Market Cap) అనేది ఆ కంపెనీకి సంబంధించి పబ్లిక్‌గా గుర్తించబడిన విలువగా చెప్పవచ్చు.

మార్కెట్ క్యాప్ ఎలా హెచ్చుతగ్గులకు లోనవుతుంది?
మార్కెట్ క్యాప్ ఫార్ములా నుండి ఇది కంపెనీ మొత్తం జారీ చేసిన షేర్ల సంఖ్యను స్టాక్ ధరతో గుణించడం ద్వారా దీనిని లెక్కిస్తారు. అంటే షేర్ ధర పెరిగితే మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతుంది.  షేర్ ధర తగ్గితే మార్కెట్ క్యాప్ కూడా తగ్గుతుంది.

#stock-market-review #market-capitalization
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe