భారత్ లో టాయిలెట్లకు వాడే చెప్పులు..అక్కడ లక్షల్లో పలుకుతున్నాయి!

కువైట్‌లోని ఒక స్టోర్ లో విక్రయిస్తున్న చెప్పుల ధరలు చూసిన భారత నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. వాటి విలువ అక్షరాల మన భారత కరెన్సీలో లక్ష రూపాయలుగా ఉంది.దీంతో కొందరు నెటిజన్లు మన టాయిలెట్స్ లో వాడే చెప్పులు లాగా ఉన్నాయి..వీటికి అంత ధర ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు.

భారత్ లో టాయిలెట్లకు వాడే చెప్పులు..అక్కడ లక్షల్లో పలుకుతున్నాయి!
New Update

కువైట్ ఇన్‌సైడ్, మధ్యప్రాచ్య దేశానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయింది. ఈ పోస్టుపై స్పందించిన భారతీయ నెటిజన్లు బాత్రూమ్ చెప్పులతో పోలుస్తున్నారు. అంతేకాదు.. సరదాగా చెప్పులపై కామెంట్లు పెడుతున్నారు. మా జీవితమంతా టాయిలెట్ కోసం 4,500 రియాల్ చెప్పులను ఉపయోగిస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ పోస్టు చేశాడు.

భారత్‌లో బాత్రూమ్‌కి వీటిని వేసుకుంటాం. మేమైతే మా దేశంలో రూ.60కి కొంటామని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. భారతీయ తల్లులు తమ పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి ఈ చెప్పులను ఉపయోగిస్తారంటూ పలువురు యూజర్లు ఫన్నీగా స్పందించారు.

#trendy-slippers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe