/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-55-jpg.webp)
Dates Health: ఖర్జూర లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్ తో పాటు సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్ వంటి మినరల్స్ ఆరోగ్యం పై మంచి ప్రభావాన్ని కలిగిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం పై మెరుగ్గా పని చేస్తాయి. చాలా మంది ఖర్జూరాలను హెల్తీ డైట్ లో భాగంగా తీసుకుంటారు. కానీ వీటిని తినేటప్పుడు కొన్ని విషయాలను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి.
ఖర్జూర తినేటప్పుడు గమనించాల్సిన విషయాలు
- మధుమేహం సమస్య, రక్తంలో అధిక చక్కర స్థాయిలు ఉన్నవారు ఖర్జూరాలను తగిన మోతాదులో తీసుకోవాలి. వాటిలో చక్కర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కావున మధుమేహం ఉన్న వారు వీటిని అతిగా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.
- అధిక బరువు ఉన్నవారు కూడా వీటిని సరైన మోతాదులో తినాలి. ఖర్జూరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వారు మోతాదుకు మించి వీటిని తీసుకుంటే శరీరంలో కేలరీలు శాతం పెరిగి అధిక బరువుకు కారణమవుతుంది.
- ఈ విషయం కొంత మందికి తెలియకపోవచ్చు.. ఖర్జూర తిన్న తర్వాత నీళ్లు బాగా తాగాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి సహాయపడును. కొన్ని సార్లు డేట్స్ తిన్న తర్వాత నీళ్లు తాగితే దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీ శరీర సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అలవాట్లను పాటించండి.
- సాధారణంగా భోజనం తర్వాత నోటిని శుభ్రం చేసుకునే అలవాటు అందరికీ ఉంటుంది. కానీ ఇతర ఏ ఆహార పదార్థాలు తిన్నా సరే నోటిని నీళ్లతో శుభ్రం చేయడం మంచిది. డేట్స్ తిన్న తర్వాత తప్పకుండా మౌత్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్జూరాలు స్టికీ గా ఉంటాయి.. అవి పళ్ళ మధ్యలో ఉండిపోయి పళ్ళ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: Green Chutneys : ఈ ఆకుకూర చట్నీస్ తింటే.. ఆరోగ్యానికి ఇంత లాభమా..!