Plane Door: గాలిలో విమానం డోర్ తీయడానికి ప్రయత్నించిన హైదరాబాదీ.. 

విమానం ఎగురుతుండగా.. అందులోని ప్రయాణీకుడు ఒకరు విమానమ్ డోర్ తెరవడానికి ప్రయత్నించి తోటి ప్రయాణీకులను భయ భ్రాంతులకు గురి చేశాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందిన ఆ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం ఆగగానే ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Plane Door: గాలిలో విమానం డోర్ తీయడానికి ప్రయత్నించిన హైదరాబాదీ.. 

Plane Door: విమానం గాలిలో ఎగురుతుండగా డోర్ తెరవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? విమానంలో ఉన్నవారి ప్రాణాలన్నీ గాలిలో ఉన్నట్టే కదా. అప్పుడప్పుడు కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడిన వార్తలు మనం వింటూ ఉంటాం. అటువంటి సంఘటనే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా జరిగింది. కలకలం రేపిన ఆ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఇండోర్-హైదరాబాద్ విమానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకోబోతూ ఉండగా.. ఒక ప్రయాణీకుడు విమానం డోర్ తెరవడానికి ప్రయత్నించి హంగామా సృష్టించాడు. నిజానికి ఈ సంఘటన మే 21న జరిగింది. కానీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ప్రయాణీకుడు డోర్ తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చూసిన ఇతర ప్రయాణీకులు అతనిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసు అధికారులు చెప్పారు. ఆ సమయంలో ఆ ప్రయాణీకుడు మద్యం మత్తులో ఉన్నట్టు ఇతర ప్రయాణీకులు తెలిపారు. 

Plane Door: విమానం ల్యాండ్ అయిన తర్వాత అతన్ని ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. అతను మానసిక రోగి అని పేర్కొంటూ అతని కుటుంబ సభ్యులు తరువాత అధికారులను ఆశ్రయించారు. సంబంధిత మెడికల్ సర్టిఫికెట్స్ ను పోలీసులకు సమర్పించారు. కుత్బుల్లాపూర్ నివాసి అయిన అతనికి శుక్రవారం స్టేషన్ బెయిల్ లభించింది. 

Also Read:  కేన్స్‌ లో చరిత్ర సృష్టించిన అనసూయ సేన్‌గుప్తా!

విమానం బయలుదేరిన దగ్గర నుంచీ..
Plane Door: ఇండోర్ నుండి విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చిప్స్, నీరు విసిరి అతనితో అసభ్యంగా ప్రవర్తించాడు. విమానం బయలుదేరిన దగ్గర నుంచీ అతని ప్రవర్తన అసహజంగా ఉండడంతో విమాన సిబ్బంది అతని సీటును వేరే దగ్గరకు మార్చారు. అయితే, కొంత సేపటి తరువాత అతను తన ఇద్దరు స్నేహితుల వద్ద కూచోవాలని పట్టు పట్టాడు. దీంతో సిబ్బంది జాలిపడి అతనిని అతనిసీటులో కూచోడానికి అనుమతి ఇచ్చారు. కొద్దిసేపు మంచిగానే ఉన్న అతను తరువాత తోటి ప్రయాణీకుడు ఒకరితో అసభ్యంగా ప్రవర్తించాడు. తరువాత విమానం డోరు వద్దకు వెళ్లి దానిని తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రయాణీకులు అతనిని అడ్డుకున్నారు. అతనిని బలవంతంగా ఒక సీటులో కూచోపెట్టారు. 

Plane Door: విమానం ల్యాండ్ కాగానే విషయాన్ని ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతనిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత అతని మానసిక స్థితి లేని విషయం తెలుసుకున్న పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. “ఎన్నిసార్లు సిబ్బంది హెచ్చరించినా ఆ వ్యక్తి విమానంలో సీట్ల మధ్య తిరుగుతూనే ఉన్నాడు. ఆఖరుకు విమానం డోర్ తీయడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రయాణీకులు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు” అంటూ ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణీకుడు తెలిపాడు. 

Advertisment
తాజా కథనాలు