TDP: కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

తిరుపతి సీటు రాకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్నందుకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పేరుతో వైసీపీ నుంచి చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఎమోషనల్ అయ్యారు.

New Update
TDP: కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

TDP EX Mla sugunamma: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఎమోషనల్ అయ్యారు. తిరుపతి సీటు రాకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. రాత్రికి రాత్రి పార్టీ మారి కండువా కప్పుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని వాపోయారు. టీడీపీ హైకమాండ్‌పై సుగుణమ్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్నందుకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి జనసేనకు వచ్చిన ఆరణి శ్రీనివాస్‌కు తిరుపతి టికెట్‌ కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాల్సిందే..జనసేన నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష..!

పార్టీని నమ్ముకున్న క్యాడర్ కు ఏమి సమాధానం చెప్పగలను అని ప్రశ్నించారు. ఇక్కడే పుట్టిన పార్టీకి ఉనికి కోల్పోయేలా కూటమి నిర్ణయించడం బాధాకరం అని భావోద్వేగం చెందారు. కూటమి పేరుతో వైసీపీ నుంచి చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో వైసీపీ గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జోస్యం చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు