Government Quarters: ప్రభుత్వ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని 200 మందికి పైగా లోక్‌సభ మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ప్రెమిసెస్ (అనధికార ఆక్రమణల తొలగింపు) చట్టం కింద అందరికీ ఈ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం గత లోక్‌సభ రద్దయిన నెలలోపు మాజీ ఎంపీలు తమ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలి. ఇప్పటి వరకు 200 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలకు తొలగింపు నోటీసులు జారీ చేశామని, వెంటనే బంగ్లాలు ఖాళీ చేయాలని సూచించామని అధికారులు చెప్పారు.
Government Quarters:అదే సమయంలో మరికొందరు మాజీ ఎంపీలకు నోటీసులు పంపే ప్రక్రియ కొనసాగుతోంది. వారు త్వరలో తమ ప్రభుత్వ నివాసాలను ఖాళీ చేయకపోతే, వారిని బలవంతంగా ఖాళీ చేయడానికి అధికారుల బృందాలను పంపుతామని అధికార వర్గాలు తెలిపాయి.
Government Quarters:ఎన్నికైన ఎంపీలకు లోక్ సభ సెక్రటేరియట్ వసతి కల్పిస్తుండగా, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ లుటియన్స్ ఢిల్లీలో కేంద్ర మంత్రులకు బంగ్లాలు కేటాయించడం గమనార్హం.
Government Quarters:మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు తమ ప్రభుత్వ బంగ్లాలను నిర్ణీత గడువులోగా ఖాళీ చేయకుంటే వారిపై తొలగింపు చర్యలు చేపట్టనున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు 83 లోధీ ఎస్టేట్‌లో బంగ్లా కేటాయించారు.
Also Read: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు…హోం మినిస్టర్ తో భేటీ!
ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు ఏ మాజీ కేంద్ర మంత్రికి కూడా గడువు దాటినందుకు గాను ఎవిక్షన్ నోటీసు ఇవ్వలేదు. స్మృతి ఇరానీతో సహా 4 గురు మాజీ కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఢిల్లీలోని లుట్యెన్స్ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేశారు. ఈ నెల ప్రారంభంలో, మాజీ మంత్రి స్మృతి 28 తుగ్లక్ క్రెసెంట్, లుటియన్స్ ఢిల్లీలోని తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత కిశోరీ లాల్ శర్మపై 1.5 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.