కొత్త తరానికి అవకాశం ఇద్దామనే తప్పకున్న..జో బైడన్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవటం పై జో బిడెన్‌ తాజాగా వివరణ ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బైడన్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. 'కొత్త తరానికి అవకాశం కల్పించేందుకే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. కమలా హారిస్ మంచి నాయకురాలని బైడెన్ కొనియాడారు.

New Update
కొత్త తరానికి అవకాశం ఇద్దామనే తప్పకున్న..జో బైడన్!

నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ట్రంప్ పై, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, పోటీ చేయాల్సి ఉంది. కానీ బైడెన్ వయసు సహా పలు కారణాలతో ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నారు. దీని తరువాత, డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంలో, కోవిడ్ భారీన పడిన ఆయన..తాజాగా కోలుకున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవటం పై జో బిడెన్‌ తాజాగా వివరణ ఇచ్చారు. కొత్త తరానికి అవకాశం కల్పించడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నాని అందుకే ఎన్నికల నుంచి తప్పుకున్నాని ఆయన తెలిపారు. దేశాన్ని ఏకం చేయడానికి ఇదే సరైన మార్గమని.. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవానికి సమయం, స్థానముందని ఆయన పేర్కొన్నారు. 50 ఏళ్లకు పైగా దేశానికి సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేసినాని బైడెన్ అన్నారు అమెరికా ప్రెసిడెంట్‌గా పనిచేయడం నా జీవితంలో లభించిన గౌరవమన్నారు. కానీ అంతరించిపోతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఏ పదవి కంటే గొప్పది కాదని ఆయన తెలిపారు.

నేను అమెరికన్ ప్రజల కోసం పని చేయడం ఆనందించాను. వైస్‌ఛాన్సలర్‌ కమలా హారిస్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమె నైపుణ్యం కలవారు. ఆమె నాతో అద్భుతంగా పనిచేశారు.ఆమె దేశానికి అత్యుత్తమ నాయకురాలుగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆ నిర్ణయం ప్రజల చేతుల్లో ఉంది. గొప్ప విషయమేమంటే అమెరికాను ఎన్నడూ రాజులు, నియంతలు పాలించలేదు. ప్రజలు పాలించారని బైడెన్ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు