AP High Court: వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పెన్షనర్ల పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈసీ చర్యలను ఏపీ హైకోర్టు సమర్థించింది. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు వేసిన పిటిషన్ ను కొట్టిపడేసింది. ఇదిలా ఉండగా ఏపీలో మొత్తం 66 లక్షల 34 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. ప్రతీ నెల ఒకటవ తేదీన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ను అందజేస్తారు.
Also Read: మాకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవడం లేదు… బిడ్డను దత్తత తీసుకోండి
అయితే, ఎన్నికల నేపథ్యంలోనే పెన్షన్లను పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు తప్పుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాల సిబ్బందే పెన్షన్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఈసీ ఆదేశాలను రద్దు చేయాలని కొందరు లబ్దిదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం పిటిషన్ ను తిరస్కరించింది.
Also Read: జగన్ మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ.. షర్మిల కాదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
మరోవైపు చూస్తే సచివాలయాల దగ్గర పెన్షన్ దారులు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఇంకా సచివాలయానికి చేరుకోని పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు వెళ్లి డబ్బు డ్రా చేసుకొచ్చాకే..పెన్షన్ ఇస్తామంటున్నారు అధికారులు. మధ్యామ్నం తర్వాత రావాలని పెన్షర్ దారులకు సూచిస్తున్నారు. దీంతో వృద్ధులు తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ పెన్షన్ వ్యవహారం అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతల మథ్య మాటల యుద్థానికి దారి తిసింది.