ఇటీవలె BCCI టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్‌ను నియమించింది. కానీ ద్రవిడ్ వారసుడిగా ఆశిష్ నెహ్రా.. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతాడని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. ఐపీఎల్ 2022 లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా 2023లో రన్నరప్‌గా నిలపడంలో హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా తన పాత్ర వహించాడు.దీంతో నెహ్రా ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటారిని అభిమానులు భావించారు.
దీంతో తాజాగా హెడ్ కోచ్ పదవి పై నెహ్రా స్పందించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టేందుకు తాను సిద్దంగా లేనని నెహ్రా తెలిపాడు.'టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి నేను ఏ రోజు ఆలోచించలేదు. నా పిల్లలు చాలా చిన్నవారు. గౌతమ్ గంభీర్ పిల్లలు కూడా చిన్నవారే. కానీ అతని ఆలోచనలు భిన్నం. ప్రతీ ఒక్కరికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అందుకే నా ప్రస్తుత బాధ్యతలతోనే నేను సంతోషంగా ఉన్నాను. కుటుంబానికి దూరంగా 9 నెలల పాటు జట్టుతో ప్రయాణం చేసే మూడ్ నాకు లేదని ఆయన అన్నారు.
హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించలేదు. క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. కోత్ కోచ్ వచ్చినప్పుడు వారి ప్రణాళికలు, ఆలోచనలకు తగ్గట్లు జట్టులో మార్పులు చేస్తుంటారు.అయితే ఈ విషయాన్ని గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హార్దిక్ పాండ్యాకు వివరించారని భావిస్తున్నాని ఆయన అన్నారు.