ఇటీవలె BCCI టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్‌ను నియమించింది. కానీ ద్రవిడ్ వారసుడిగా ఆశిష్ నెహ్రా.. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతాడని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. ఐపీఎల్ 2022 లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా 2023లో రన్నరప్‌గా నిలపడంలో హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా తన పాత్ర వహించాడు.దీంతో నెహ్రా ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటారిని అభిమానులు భావించారు.
పూర్తిగా చదవండి..బీసీసీఐ హెడ్ కోచ్ దరఖాస్తు పై స్పందించిన నెహ్రా!
గుజరాత్ జట్టు కోచ్ ఆశీష్ నెహ్రా బీసీసీఐ హెడ్ కోచ్ గా దరఖాస్తు చేసుకోకపొవటంపై తాజా గా స్పందించారు.తన పిల్లలు చిన్నవారని, కోచ్ గా ఉంటే కొన్నినెలలు పాటు వారికి దూరంగా ఉండాల్సి వస్తుందని అందుకే దరఖాస్తు చేయలేదని నెహ్రా తెలిపారు.అయినా ఇప్పుడు ఆ పదవి పై ఆసక్తి లేదని పేర్కొన్నారు.
Translate this News: