BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా?

తెలంగాణలో ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. జులై 17 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో నిరుద్యోగుల వినతి మేరకు పరీక్షను వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా?
New Update

TGPSC Group 2: గ్రూప్-2 పరీక్ష వాయిదాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగుల ఆందోళనతో పరీక్షను వాయిదా వేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీకి ప్రభుత్వం సూచించే అవకాశం ఉందని సమాచారం. గ్రూప్ 2, డీఎస్సీ ప‌రీక్షలు ఒక‌దాని వెంట మరొకటి ఒక‌టి ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. రెండు పరీక్షలకు సిలబస్ వేర్వురుగా ఉండడంతో తాము ఒకే సారి ఎలా ప్రిపేర్ కావాలని.. వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయాన్ని పలువురు విద్యార్థి సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జులై 17నుంచి ఆగ‌స్టు 5 వరకు డీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయని.. అనంతరం 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయని వారు సీఎంకు వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించారు. ఈ పరీక్షల తేదీల విష‌యంలో టీజీపీఎస్‌సీ, విద్యాశాఖ‌తో చ‌ర్చించి త‌దుప‌రి నిర్ణయం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఈ రోజు సాయత్రంలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

జాబ్ క్యాలెండర్, పలు నియామక పరీక్షల వాయిదా.. తదితర డిమాండ్లతో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.

కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగుల‌కు సూచించారు. ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చితే త‌లెత్తే చ‌ట్ట ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ప్ర‌భుత్వం త‌గు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే నిరుద్యోగుల‌కు న్యాయం జ‌రగ‌క‌పోగా.. ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Also Read: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

#tspsc-group-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe