AP: పశ్చిమగోదావరి జిల్లా రావిపాడులో ఉద్రిక్తత.. జవాన్ కుటుంబ సభ్యులకు దళిత సంఘాలకు వాగ్వివాదం

పశ్చిమగోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో జవాన్ భార్య విజయలక్ష్మిపై కొందరు దళిత సంఘాల నాయకులు దాడి చేశారు. అదే స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటంతో ఈ వివాదం మొదలైంది.

New Update
AP: పశ్చిమగోదావరి జిల్లా రావిపాడులో ఉద్రిక్తత.. జవాన్ కుటుంబ సభ్యులకు దళిత సంఘాలకు వాగ్వివాదం

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆర్మీలో పనిచేస్తున్న రావిపాడు గ్రామానికి చెందిన పలివెల నాగేశ్వరరావుకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటంతో ఈ వివాదం మొదలైంది.

Also Read:  ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’… పిచ్చెక్కిస్తున్న పుష్ప 2 సాంగ్..!

ప్రభుత్వం కేటాయించిన స్థలంలో జవాన్ భార్య విజయలక్ష్మిపై కొందరు దళిత సంఘాల నాయకులు దాడి చేశారు. అదే స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనీ దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో జవాన్ కుటుంబ సభ్యులకు దళిత సంఘాలకు వాగ్వివాదం జరిగింది.

Also Read: కలుషిత నీరు తాగి అస్వస్థత.. ఇద్దరు మృతి..!

గ్రామంలో ఏటువంటి ఘర్షణలు జరగకుండా రాత్రి నుంచి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, రాత్రీ సమయంలో పోలీసులపైనే దాడి చేశారు దళిత సంఘాల నాయకులు. దీంతో నేడు ఉదయం ఉన్నతాధికారులు రావిపాడు గ్రామానికి వెళ్లారు.  ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం తొలగించి వివాదం సర్దూమనిగు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు