తెలుగు రాష్ట్రాలు గజగజ.. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎంతంటే

తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్‌లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్‌ హత్నుర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

New Update
తెలుగు రాష్ట్రాలు గజగజ.. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎంతంటే

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పల్లెలతోపాటు పట్టణాలను చలి గజగజ వణికిస్తోంది. ఉదయం ఏడు దాటిన మంచు దుప్పటి కప్పేసినట్లు ఉంటుంది. దీంతో ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు చేరుకుంటున్నాయి. పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారినపడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

ఈ మేరకు ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండటంతో పలు జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. పది రోజులుగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్‌ హత్నుర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర, ఈశాన్యం దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. చలికితోడు పొగ మంచు భారీగా కురుస్తున్నది. ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతున్నది. ఆదివారం సంగారెడ్డిని మంచు దుప్పటి కమ్మేసింది. నాందేడ్‌-అఖోల నేషనల్‌ హైవే 161ని పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 10 దాటినా రోడ్డుపై పొగమంచు దట్టంగా కమ్ముకున్నది. హైవేపై కనుచూపు మేరలో వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొందరు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణాలను కొనసాగించారు. రాబోయే 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక నగరంలో రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.6 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.3 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 32 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : TSRTC: మహిళలకు తెలంగాణ ఆర్టీసీ షాక్.. పురుషులకు ప్రత్యేక సీట్లు!

ముఖ్యంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవగా ఆసిఫాబాద్‌, తిర్యానీ, సోనాల, బేల, బజార్‌ హత్నూర్‌, పొచ్చెరలో, పెంబిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శీతల గాలుల ప్రభావం పెరిగింది. రాబోయే 2-3 రోజులు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. చలికితోడు పొగ మంచు కూడా కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు