ORR పై టెన్షన్‌..టెన్షన్‌..ఐటీ ఉద్యోగుల కార్‌ ర్యాలీకి నో పర్మిషన్‌..!!

హైదరాబాద్‌ నానక్ రామ్ గూడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద టెన్షన్‌ వాతవారణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కార్ ర్యాలీ చేసేందుకు సిద్దమైయ్యారు ఐటీ ఉద్యోగులు. ఐయామ్ విత్ సీబీఎన్‌ అంటూ నినాదాలు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఐటీ ఉద్యోగుల ర్యాలీకి పర్మిషన్‌ లేదంటున్నారు పోలీసులు. ORR పై కార్లను తనిఖీలు చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీపై పోలీసులు మరింత అప్రమత్తమైయ్యారు.

New Update
ORR పై టెన్షన్‌..టెన్షన్‌..ఐటీ ఉద్యోగుల కార్‌ ర్యాలీకి నో పర్మిషన్‌..!!

IT Employees Protest in Hyderabad: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill Development Case)టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు (Chandrababu Arrest) చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును విడుదల చేయాలంటూ టీడీపీ పార్టీ శ్రేణులు, అభిమానుల ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. ఐటీ ఉద్యోగులు సైతం చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రోడెక్కారు.

హైదరాబాద్‌ నానక్ రామ్ గూడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద టెన్షన్‌ వాతవారణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కార్ ర్యాలీ చేసేందుకు సిద్దమైయ్యారు ఐటీ ఉద్యోగులు. ఐయామ్ విత్ సీబీఎన్‌ (I Am With CBN) అంటూ నినాదాలు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఐటీ ఉద్యోగుల ర్యాలీకి పర్మిషన్‌ లేదంటున్నారు పోలీసులు. ORR పై కార్లను తనిఖీలు చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీపై పోలీసులు మరింత అప్రమత్తమైయ్యారు.

కాగా,ఢిల్లీ అశోకా రోడ్డులోని రామ్మోహన్ నాయుడు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వివిధ అంశాలపై స్పందించాల్సిన తీరు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు అక్రమ అరెస్టుపై సభలో ఎలా ప్రస్తావించాలి అన్న విషయాలపై చర్చించనున్నరని సమాచారం. పార్లమెంటరీ పార్టీ భేటీకి ఎంపీలతో పాటు నారా లోకేశ్‌, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన రావు హాజరుకానున్నారు.

Also Read : అవినీతి కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: జగన్

Advertisment
తాజా కథనాలు