అఘోరీ ఆగ్రహం
ఇంట్లో నిర్బంధించడం పై అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అక్కడి భద్రతను ఏసీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అఘోరీ బయటకు రాకుండా ఆమె ఇంటి వద్ద ఒక ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లను ఉంచారు. ఆమెను ఎవరూ కలువకుండా పోలీసుల భద్రత చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అఘోరిని నిర్బంధం నుంచి బయటకు తీసుకురావడానికి హైదరాబాద్ నుంచి ఆమె లీగల్ టీమ్ ప్రయత్నిస్తోంది.
ఇది ఇలా ఉంటే తెలంగాణలో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ హాట్ టాపిక్‌గా మారింది. నగ్నంగా పలు ఆలయాలు సందర్శిస్తూ అక్కడ పూజలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను చాలా మీడియాలు ఇంటర్వ్యూ చేశాయి. ఆపై మళ్లీ కేదరినాథ్ వెళ్లిపోయిన ఆ లేడీ అఘోరీ మళ్లీ తిరిగి అక్టోబర్ 29న వస్తానని తెలిపింది. ఆమె అనుకున్నట్లుగానే అక్టోబర్ 29న తెలంగాణకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం సందర్శించిన అఘోరీ.. సనాతన ధర్మంపై పోరాటంలో భాగంగా ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది. ఈ ఆత్మార్పణలో తాను చనిపోతే శివుని దగ్గరకు వెళ్లిపోతానని.. చావకపోతే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. అక్టోబర్ 31న ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: కత్తులతో నరికి ఎలా చంపారంటే?.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి !