కేదార్నాథ్‌లో ఉన్న అఘోరీ, శ్రీ వర్షిణిల కోసం తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే వీరిపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో వీరికోసం హైదరాబాద్ పోలీసులు కేదార్నాథ్ వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు అఘోరీ, శ్రీ వర్షిణి ఇష్యూపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. దీంతో అఘోరీ, శ్రీ వర్షిణిలో అరెస్ట్ భయం కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది. తమ జోలికి రావొద్దు, వస్తే చస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు వీరిద్దరూ. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఘోరీపై తీవ్రమైన వ్యతిరేకత
వర్షిణితో పెళ్లి తర్వాత అఘోరీపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అఘోరీపై వ్యతిరేకత గళాన్ని వినిపించేవాళ్లు ముందుకు వస్తున్నారు. అఘోరీ మొదటి భార్య తానంటూ ఇటీవల ఓ మహిళ ముందుకు వచ్చి పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వీరికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఏ టైమ్ లోనైనా అఘోరీ, శ్రీ వర్షిణిలని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా అఘోరీ, శ్రీ వర్షిణిలు ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఓ కాళిమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.