Jubilee Hills By Poll 2025: మాకు ఇంట్రెస్ట్ లేదు.. సారీ! పోలింగ్‌పై ఓటర్ల నిరాశక్తి

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ఓటర్ల స్పందన మందగించింది. ఉదయం 11 గంటల వరకు కేవలం 20.76% పోలింగ్‌ మాత్రమే నమోదైంది. బస్తీ ప్రాంతాల్లో కొంతమంది ఓటు వేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో ఓటర్లు నిర్లక్ష్యంగా ఉన్నారు.

New Update
Jubilee Hills By Poll 2025

Jubilee Hills By Poll 2025

Jubilee Hills By Poll 2025:

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ఓటర్ల స్పందన నిరాశ కలిగిస్తోంది. ఉదయం 11 గంటల వరకు కేవలం 20.76 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదైంది. బస్తీ ప్రాంతాల్లో కొంతమంది ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, చాలా మంది ఓటర్లు ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నారు.

ఓటింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు, అభ్యర్థులు ప్రజలను పోలింగ్‌ కేంద్రాలకు రావాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. కొంతమంది ఓటర్లు సెలవు రోజు విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, రాజకీయ ఆసక్తి తగ్గిపోవడం కూడా తక్కువ ఓటింగ్‌కు కారణమని స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, అభ్యర్థుల వాగ్దానాలు ఉన్నప్పటికీ ఓటర్లలో ఉత్సాహం కనిపించకపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. మధ్యాహ్నం తరువాత ఓటింగ్‌ శాతం పెరుగుతుందన్న ఆశతో అధికారులు, పార్టీ ప్రతినిధులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు