/rtv/media/media_files/2025/11/11/jubilee-hills-by-poll-2025-2025-11-11-07-07-53.jpg)
Jubilee Hills By Poll 2025
Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు (EVM), వీవీ ప్యాట్ యంత్రాలతో తమ తమ బూత్‌లకు వెళ్లారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు, ఉదయం 7 గంటల నుంచి అధికారికంగా ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు ఓటింగ్ జరగనుంది. యూసఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుండి అన్ని ప్రాంతాలకు పోలింగ్ మెటీరియల్ పంపిణీ పూర్తయింది. మొత్తం 5 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు.
ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. దొంగ ఓట్లు, గొడవలు జరుగకుండా అధికారులు కఠిన నిఘా పెట్టారు. డ్రోన్ల ద్వారా భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఈవీఎం యంత్రాలు పనిచేయకపోతే వెంటనే బ్యాకప్ యంత్రాలను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల అధికారులు తెలిపారు.
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,000 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. రిజర్వ్ సిబ్బందితో కలిపి సంఖ్య 2,394కి చేరింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో రౌడీషీటర్లను బైండోవర్ చేసి శాంతిభద్రతలు కాపాడే చర్యలు తీసుకున్నారు. ఎవరైనా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
జీహెచ్‌ఎంసీ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద పారిశుధ్య పనులు పూర్తి చేశారు. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద వసతులను పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేయించారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల వరకు సున్నపు గీతలు వేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ వివరాలు:
- మొత్తం ఓటర్లు: 4,01,635
- పురుషులు: 2,08,561
- మహిళలు: 1,92,779
- ఇతరులు: 25
- పోలింగ్ కేంద్రాలు: 407
- సమస్యాత్మక కేంద్రాలు: 226
- పోలింగ్ సిబ్బంది: 2,060
- పోలీసు సిబ్బంది (రిజర్వ్‌తో కలుపుకొని): 2,394
- బ్యాలెట్ యూనిట్లు: 561
- వీవీ ప్యాట్ యంత్రాలు: 595
- పోటీదారులు: 58
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్య పండుగకు రంగం సిద్ధమైంది. అధికారులు, పోలీసు బలగాలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉంది.
Follow Us