Hyderabad: ఈ మధ్య చాలా మంది యువత రోడ్ల పై బైకులతో విన్యాసాలు చేస్తూ.. అదొక ఎంజాయిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఆ క్షణిక ఆనందంలో ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. శామీర్‌పేటలో దగ్గర ఇద్దరు యువకులు రాష్ డ్రైవింగ్ చేస్తూ బస్ బస్‌ను ఓవర్ టేక్ చేయబోయి ప్రాణాలు తీసుకున్నారు.
ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్
షేక్ నక్లిన్, అతని స్నేహితుడు మహమద్ ఫర్హాన్ హోండా యాక్టివాపై కరీంనగర్ నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో రాష్‌గా డ్రైవ్ చేసి బస్‌ను ఓవర్ టేక్ చేయబోయాడు నక్లిన్. దీంతో అదుపు తప్పిన బైక్.. బస్ వెనుక చక్రాల కిందకు దూసుకెళ్లింది. నక్లిన్ మీద నుంచి బస్ వెళ్లడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఫర్హాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవలే ఎన్టీఆర్ జిల్లా గరికపాడులో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రెండు కార్లు ఢీకొనడంతో తల్లి, కొడుకు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌కి చెందిన వారు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తుండగా గరికపాడు సమీపంలోని NH-65పై యాక్సిడెంట్ జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి.
రాజస్థాన్‌లో మరో ఘటన..
ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నహ్నూ, జహీర్ కుటుంబసభ్యులతో కలిసి బరౌలీ గ్రామంలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపోని స్పీడ్‌తో వస్తున్న స్లీపర్ బస్సు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 8 మంది చిన్నారులతో సహా 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.