గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి

ఆరేళ్ళ క్రితం మతిస్థిమితంలేక తప్పిపోయిన తండ్రి తమ కూతుళ్ళకు ఓ అనాథాశ్రమంలో కనిపించాడు. తండ్రని చూడగానే ఒక్కసారిగా ఆ కూతుళ్ళు భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

New Update

Viral Video: ప్రతి అమ్మాయికి తమ జీవితంలో తండ్రి అనేవాడు కొండత అండా. తండ్రిలేని జీవితం ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. అలాంటిది ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రి ఒక్కసారిగా అనాధాశ్రమంలో కనిపిస్తే ఆ బిడ్డలు ఎంత బాగోద్వేగానికి గురై ఉంటారో ఊహించగలరా..? అవును ఇది నిజంగా జరిగిన ఘటన. 

Also Read: అవినాష్ కి షాకిచ్చిన నబీల్..నో ఎలిమినేషన్ ట్విస్ట్..!

తండ్రి కోసం కూతుళ్ళ ఆవేదన 

అయితే బాలయ్య అనే వ్యక్తి ఆరేళ్ళ క్రితం మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయాడు. ఆ తర్వాత ఆయన కన్న కూతుళ్లు అతనికి కోసం వెతకని ప్రదేశం లేదు, వెళ్ళని చోటు లేదు. తండ్రి కోసం ఎంత వెతికిన ఆ కన్నబిడ్డలకు నిరాశే మిగిలింది. ఇలా ఆరేళ్ళు పాటు తండ్రి ఆచూకీ కోసం అలమటిస్తూనే కాలం గడిపేశారు ఆ బిడ్డలు. ఆరేళ్ళ తర్వాత దేవుడు ఆ కన్నబిడ్డల మోర ఆలకించాడేమో.. తండ్రని ఆ కూతుళ్ళ కంటపడేలా చేశాడు. 

Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!

ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి.. 

బాలయ్య కూతుళ్లు ఈరోజు మాతృదేవ అనాథాశ్రమంలో అన్నదానం జరిపించడానికి వెళ్లగా.. అక్కడ తమ తండ్రి కనిపించాడు. 130 మందిలో తండ్రిని గుర్తుపట్టి పరుగెత్తుకుంటూ వెళ్లారు ఆ కూతుళ్లు. ఆరేళ్ళ క్రితం మతిస్థిమితంలేక తప్పిపోయిన నాన్నను ఒక్కసారిగా చూసి ఇద్దరు కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు. తండ్రిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి మనసుల్ని కలచివేస్తోంది. ఆ కన్నబిడ్డల భావోద్వేగం చూస్తుంటే.. ఇన్నాళ్లు తండ్రిని ఎంతలా మిస్ అయ్యారో తెలుస్తుంది.  అయితే ఆరేళ్ళ కింద బాలయ్య మతిస్థిమితం కోల్పోయి జూబిలిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా.. అతన్ని గమనించిన కొందరు మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో 'ఆశ్రయం' కల్పించారు.

Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe