/rtv/media/media_files/2024/12/28/N5JNwOMvCzUnaX9k8vq6.jpg)
Fire Accident
HYD Fire Accident:
కోకాపేటలోని జీఏఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించలేదని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ స్పష్టం చేశారు. బిల్డింగ్‌లో జరుగుతున్న రెస్టారెంట్ పనుల సమయంలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఆ గ్యాస్ పీల్చిన కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారని. వారిని వెంటనే కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం అందడంతో నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
అయితే మొదటగా, కోకాపేట జీఏఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగి ఐటీ ఉద్యోగులు గాయపడ్డారని వార్తలు ప్రచారం అయ్యాయి. మరి కొంత మంది బిల్డింగ్‌లో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రచారం చేసారు అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఏసీపీ రమణ గౌడ్ స్పష్టం చేశారు.