Municipal election results 2026 : ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఉత్తర తెలంగాణలో పట్టు నిరూపించుకుంటూ ధర్మపురి, పెద్దపల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.

New Update
congress

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఉత్తర తెలంగాణలో పట్టు నిరూపించుకుంటూ ధర్మపురి, పెద్దపల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఇక్కడి మొత్తం 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించి, ప్రతిపక్షాలకు కనీసం ఒక్క సీటు కూడా దక్కకుండా క్లీన్ స్వీప్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడంతో కేడర్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మరోవైపు పెద్దపల్లి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 36 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 27 వార్డులను గెలుచుకుని మున్సిపల్ పీఠంపై పట్టు సాధించింది. పెద్దపల్లిలో బీఆర్‌ఎస్, బీజేపీలు కేవలం ఒక్కో స్థానానికే పరిమితం కాగా, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 5 చోట్ల గెలిచి రెండో స్థానంలో నిలిచారు. ఈ విజయాలతో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ పండగ చేసుకుంటున్నాయి.

Advertisment
తాజా కథనాలు