BIG BREAKING : బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర పలికింది . రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా లింగాల ధశరథ్ గౌడ్ రూ. 35లక్షలకు పలికారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఈ లడ్డూ కోసం పోటీ పడుతున్నారు. గతేడాది రూ. 30లక్షలకు బాలాపూర్ లడ్డూ అమ్ముడుపోయింది.

New Update
balapur (2)

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర పలికింది. వేలం పాట రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా కర్మన్ ఘూట్ కు చెందిన లింగాల ధశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు పలకి దక్కించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఈ లడ్డూ కోసం పోటీ పడుతున్నారు. గతేడాది రూ. 30లక్షలకు బాలాపూర్ లడ్డూ అమ్ముడుపోయింది. కొలను శంకర్ రెడ్డి కొనుగోలు చేశారు. బాలాపూర్ లడ్డూ ఈ సారి దక్కించుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ వేలంలో 38 మంది పాల్గొన్నారు. 

ఎంతో ప్రత్యేకంగా ఈ లడ్డూను

బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ వారు ఎంతో ప్రత్యేకంగా ఈ లడ్డూను  తయారు చేయిస్తారు. ఈ బాలాపూర్ లడ్డూను హనీ ఫుడ్స్ వారు తయారు చేస్తున్నారు. గతంలో ఈ లడ్డూను తయారు చేసిన కుటుంబ వంశస్తులు తయారు చేస్తారు. 1994 నుంచి ఇప్పటి వరకు ప్రతీ ఏడాది లడ్డూను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ లడ్డూ తయారీలో శనగపిండి, కలకండ, ఆవు నెయ్యి, యాలకులు, డ్రైఫూట్స్ వంటివి ఉపయోగిస్తారు. లడ్డూ తయారీలో పంచదారకు బదులు కలకండను ఉపయోగిస్తారు. దీనివల్ల లడ్డూ ప్రత్యేకమైన రుచి ఉండటంతో మెరుస్తుందట. 

ఈ బాలాపూర్ లడ్డూను తయారు చేసే ముందు శనగపిండిని కొద్దిగా ఆవు నెయ్యిలో దోరగా వేయించుకుంటారు. దీనివల్ల పిండిలో ఉన్న పచ్చి వాసన పోయి లడ్డూకు మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత మరో పాత్రలో కలకండ పానకం తయారు చేస్తారు. సరైన పాకంలో ఉండేలా చూసుకుంటారు. ఇందులో డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, వేయించిన శనగపిండిని కలిపి బాగా మిశ్రమం చేస్తారు. ఈ మిశ్రమం తయారీలో ఎంత నెయ్యి వాడారనే దాటి బట్టి లడ్డూకి రుచి వస్తుంది. మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత, చేతితో లడ్డూలను ఉండలుగా చుడతారు. దీన్ని వెండి లేదా ఇత్తడి ప్లేట్‌లో ఉంచి దేవుడి దగ్గరకు తీసుకెళ్తారు. అయితే ఈ లడ్డూను కేవలం 21 కేజీలతో మాత్రమే తయారు చేస్తారు. అయితే ఇలా చేయడానికి కూడా ఓ కారణం ఉంది. 21 అనే సంఖ్యను చాలా శుభకరమైనదిగా భావిస్తారు. ఇది ప్రధానంగా సంపద, విజయం, అదృష్టానికి సూచికగా పరిగణిస్తారు. ఈ రెండు అంకెలను కలిపితే మూడు వస్తుంది. సంఖ్యా శాస్త్రంలో 3వ అంకె గురువు (బృహస్పతి) గ్రహాన్ని సూచిస్తుంది. ఇది జ్ఞానం, సంపద, శ్రేయస్సుకు కారకంగా భావిస్తారు. దీనివల్ల శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. అందుకే లడ్డూ తయారీలో 21 కేజీలు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisment
తాజా కథనాలు