Srikala Reddy: యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ సత్తా చాటేనా?..ఇంతకు ఎవరీ శ్రీకళా రెడ్డి..!

యూపీ లోకసభ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ బరిలోకి దిగారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ కేటాయించడంతో జౌన్ పూర్ స్థానం నుంచి శ్రీకళా రెడ్డి పోటీలో నిలిచారు. ఇంతకీ ఎవరీ శ్రీకాళారెడ్డి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Srikala Reddy: యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ సత్తా చాటేనా?..ఇంతకు ఎవరీ శ్రీకళా రెడ్డి..!
New Update

Srikala Reddy:  యూపీ లోకసభ ఎన్నికల్లో జౌన్ పూర్ స్థానం నుంచి బీఎస్పీ తరపున బరిలోకి తెలంగాణ మహిళ శ్రీకళా రెడ్డి.సోషల్ మీడియాలో శ్రీకళారెడ్డి గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఆమెగతంలో 2004లో కోదాడ నుంచి టీడీపీ తరపున, 2019లో బీజేపీ నుంచి హుజుర్ నగర్ లో బరిలోకి దిగుతారన్న వార్తలు వచ్చాయి. తాజాగా యూపీలో తన భర్త ధనుంజయ్ సింగ్ కు జైలు శిక్షపడటంతో ఆమె బరిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన కీసర జితేందర్ రెడ్డి ఒక్కగానొక్క కూతురు శ్రీకళారెడ్డి. తండ్రి జితేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1972లో హుజుర్ నగర్ స్థానం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రముఖ నిప్పో బ్యాటరీ గ్రూప్ కంపెనీ ఈ కుటంబానికి చెందినది. ఈ కంపెనీ చెన్నై కేంద్రంగా పనిచేయడంతో శ్రీకళారెడ్డి బాల్యం అంతాకూడా చెన్నైలోనే గడిచింది. ఆమె ఇంటర్ చెన్నైలో చదవగా..డిగ్రీ హైదరాబాద్ లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేశారు.

2017లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో చాలా సింపుల్ ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు ధనుంజయ్ సింగ్ ను శ్రీకళా రెడ్డి పెళ్లి చేసుకున్నారు. ధనంజయ్ సింగ్ శ్రీకళా మూడో భార్య. మొదటిభార్య ఆత్మహత్య చేసుకోగా..రెండవ భార్యకు విడాకులు ఇచ్చి శ్రీకళారెడ్డిని మూడో భార్యగా స్వీకరించాడు. అనంతరం ఇండియాకు వచ్చే చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఎంతో మంది వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు నటుడు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు.

అయితే రాజకీయాలపై శ్రీకళారెడ్డికి ఎంతో ఆసక్తి. 2004లో టీడీపీలో చేరారు. అక్కడి నుంచే ఆమె రాజకీయ ప్రస్తానం షురూ చేశారు. ఎమ్మెల్యే కావాలనే కోరికతో కోదాడ టీడీపీ టిక్కెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీటీడీపీలో టిక్కెట్ రాకపోవడంతో వైసీపీలో చేరాు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలోకి చేరారు. 2019లో హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగారిలోకి దిగేందుకు ప్రయత్నించారు. టిక్కెట్ దక్కలేదు. ఆ తర్వాత 2021లో యూపీలో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జడ్పీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. శ్రీకళారెడ్డి ధనంతురాలు. ఆమెకు రూ. 780కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ధనుంజయ్ సింగ్ వద్ద కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థులు.. సస్పెండ్!

#lok-sabha-elections-2024 #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe