CM Revanth Reddy: తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలు సచివాలయంలో సీఎం ఏ.రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రతి క్రీడాకారుడిని పలకరించి వారి విజయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, వారు ఆడబోయే టోర్నీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విజేతలందరినీ సీఎం శాలువాలతో సత్కరించి, వారి విజయాలకు గుర్తుగా పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ఓటమికి కేటీఆరే కారణం.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, జాబితా రూపొందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం తగినంత ప్రోత్సాహం అందిస్తుందని సీఎం అన్నారు. అర్హతలకు అనుగుణంగా ఆర్థిక సాయం, ఉద్యోగావకాశాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి: రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్న ఢిల్లీ మహిళా పోలీసు దళం
ఈ సందర్భంగా విజేతలందరూ తమ పతకాలు, అవార్డులను ముఖ్యమంత్రికి చూపించారు. తమకు అందించిన ప్రోత్సాహంపై ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. హుసాముద్దీన్ (బాక్సింగ్ మరియు కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత), ఈషా సింగ్ (షూటింగ్ , ఆసియా క్రీడలు- 2023 బంగారు పతక విజేత), ఆసియా క్రీడలు- 2023లో పాల్గొన్న నిఖత్ జరీన్ (బాక్సింగ్‌లో కాంస్య పతకం), కినాన్ చెనై డారియస్ (షూటింగ్‌లో బంగారు పతక విజేత), అగసర నందిని (అథ్లెటిక్స్‌లో కాంస్య పతక విజేత), ఎన్. సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్ పార్టిసిపెంట్) పి. గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్ పార్టిసిపెంట్), పారా అథ్లెట్, పారా గేమ్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన జీవన్‌జీ దీప్తి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.