Weather Update: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు..! తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 10 రోజులు వరకు మండే ఎండలు ఉండవని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 మధ్య రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. By Jyoshna Sappogula 13 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: మండే ఎండకాలంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 10 రోజులు వరకు మండే ఎండలు ఉండవని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 మధ్య రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులతో ప్రజలు సేదతీరుతున్న సంగతి తెలిసిందే. Also Read: బాలీవుడ్ రామాయణంలో సాయి పల్లవి..ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇదే వాతావరణం రానున్న మరో పది రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 25 వరకు వేడిగాలులు ఉండవని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ వార్తతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. హమయ్య అంటూ రిలాక్స్ అవుతున్నారు. #telangana-weather మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి