UPSC : సివిల్స్ లో సత్తాచాటిన పాలమూరు పేదింటి బిడ్డ.. తొలిప్రయత్నంలోనే మూడోర్యాంకు..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2023 పరీక్ష ఫలితాలు మంగళవారం రిలీజ్ అయ్యాయి. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు పేదింటి బిడ్డ సత్తా చాటింది. తొలిప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. దోనూరు అనన్య రెడ్డి సక్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
UPSC : సివిల్స్ లో సత్తాచాటిన పాలమూరు పేదింటి బిడ్డ.. తొలిప్రయత్నంలోనే మూడోర్యాంకు..!

Ananya Reddy from Telangana Third Rank in UPSC: పాలమూరు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలో ఆలిండియాలో మూడో ర్యాంకు సాధించింది. దీంతో అనన్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా అనన్య రెడ్డి (Ananya Reddy) మాట్లాడారు. మాది పాలమూరు జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ మిరాండ హౌస్ లో జియోగ్రఫీలో డిగ్రీ చేశాను. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ మీద ఫోకస్ పెట్టిన. దీంతో రోజుకు 12 నుంచి 14గంటల పాటు కష్టపడి చదివాను. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నాను. దీని హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుని పకడ్బందీగా చదివాను. అయితే ఈ ఫలితాల్లో మూడో ర్యాంకు వస్తుందని నేనే ఊహించలేదని అనన్య రెడ్డి తెలిపారు.

సోషల్ సర్వీస్ చేయాలనే తపన తనలో చిన్ననాటి నుంచి ఉందని..ఈ క్రమంలోనే సివిల్స్ పై ఫోకస్ పెట్టినట్లు అనన్య రెడ్డి తెలిపారు. తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలిఅమ్మాయిని తనే అని చెప్పారు. తన తండ్రి సెల్ఫ్ ఎంప్లాయ్ అని అమ్మ గృహిణి అని తెలిపారు.

యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ 2023 పరీక్ష ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు రాగా..అనిమేష్ ప్రదాన్ కు రెండో ర్యాంకు, అనన్య రెడ్డికి మూడో ర్యాంకు, పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ కు నాలుగో ర్యాంకు, రుహనీ ఐదో ర్యాంకు సాధించారు. మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. అందులో జనరల్ కేటగిరిలో 347, ఈడబ్ల్యూఎస్ 115, ఓబీసీ 303, ఎస్సీ కేటగిరి కింద 165, ఎస్టీ కేటగిరి కింద 86 మందిని సెలక్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: ఉద్యోగులకు టీడీఎస్ మెసేజ్ పంపిస్తోన్న ఐటీశాఖ..మీకు వస్తే ఏం చేయాలో తెలుసా?

Advertisment
తాజా కథనాలు