CV Anand: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. భారీగా IPSల బదిలీలు తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీగా బదిలీ చేసింది. ప్రస్తుతం సీపీగా పని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను నియమించింది. By Nikhil 07 Sep 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏసీబీ డీజీగా పని చేస్తున్న సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీగా బదిలీ చేసింది. ప్రస్తుతం సీపీగా పని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను నియమించింది. ఎన్నికల ముందు వరకు సీవీ ఆనందర్ హైదరాబాద్ సీపీగా పని చేశారు. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆయనను ఏసీబీ డీజీగా నియమించింది. ఏసీబీలోనూ ఆయన తనదైన మార్క్ చూపించారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో అవినీతి అనకొండలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో.. అనేక మంది సీఐలు, ఎస్ఐలు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. పోలీస్ శాఖలో మాత్రమే కాకుండా.. ఇతర శాఖల అధికారులు కూడా ఇటీవల ఏసీబీకి భారీగా చిక్కారు. సీవీ ఆనంద్ దెబ్బకు కొందరు పోలీసులు ఇటీవల గతంలో తాము తీసుకున్న లంచాలను కూడా తిరిగి వెనక్కి ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో సీవీ ఆనంద్ ను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అయితే.. శాంతిభద్రతల సమస్యలు పెరిగిపోవడం.. ట్రాఫిక్ నియంత్రణ తదితర కారణాలతోనే హైదరాబాద్ సీపీని మార్చారన్న ప్రచారం ప్రభుత్వం వర్గాల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో సైబరాబాద్, హైదరాబాద్ సీపీగా పని చేసిన అనుభవం ఉన్న సీవీ ఆనంద్ కు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంకా.. మరో ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ ను పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేశ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. #hyderabad-cp-cv-anand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి