TS Inter Exams: విద్యార్థులకు అలర్ట్..రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్..!!

తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.మూడువిడతల్లో ఫిబ్రవరి 1 నుంచి 5వరకు మొదటి విడత, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రెండో విడత, ఫిబ్రవరి 11 నుంచి 16వరకు మూడో విడత ప్రాక్టికల్స్ కొనసాగుతాయి.

New Update
AP: విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ రిలీజ్..ఇలా డౌన్ లోడ్  చేసుకోండి..!

TS Inter Exams: తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు(Practical tests) ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16వ తేదీ వరకు మూడువిడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 5వరకు మొదటి విడత, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రెండో విడత, ఫిబ్రవరి 11 నుంచి 16వరకు మూడో విడత ప్రాక్టికల్స్ కొనసాగుతాయి. మొత్తం 2,032 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా తేదీల్లో మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండోవ సెషన్ పరీక్షలు జరుగుతాయి.

జనరల్ కోర్సుల్లో 3.21 లక్షల మంది విద్యార్థులు, వొకేషనల్ 94వేల మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. MPCలో 2,17,714, Bipcలో 1,04,089 మంది విద్యార్థులు, వొకేషనల్‌ ఫస్టియర్‌లో 48,277, సెకండియర్‌లో 46,542 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

ఇక ఇంటర్ మొదటి సంవత్సరం(First year of Inter) విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టులో ఈ ఏడాది నుంచి మొదటిసారిగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 17 వ తేదీన ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పర్యావరణ శాస్త్రం పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 17న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను నిర్వహిస్తారు.

కాగా అటు ఏపీలోనూ ఫిబ్రవరి నెలలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ సాధారణ కోర్సులకు ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి.

ఇది కూడా చదవండి: నిర్మలమ్మ బడ్జెట్ పై అంకుర పరిశ్రమల కోటి ఆశలు..వారి కోరికలు ఫలిస్తాయా?

Advertisment
తాజా కథనాలు