TS Police Jobs: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు!

తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు మార్కులు కలపాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఇండిపెండెంట్ నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత నాలుగు వారాల్లో తుది ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది.

New Update
TS Police Jobs: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు!

Telangana Constable Recruitment: తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన అడ్డంకి తొలగిపోయింది. అభ్యర్థులకు నాలుగు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు (Telangana High Court) డివిజన్ బెంచ్ కొట్టేసింది. నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది డివిజన్ బెంచ్. దీంతో 15,640 కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు లైన్ క్లీయర్ అయ్యింది. తెలంగాణలో సివిల్‌, ఏఆర్‌, తదితర విభాగాల్లో మొత్తం 16,604 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం 15,640 మంది శిక్షణకు ఎంపిక చేసింది.
ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్‌పీఎస్సీపై ప్రభుత్వం కొత్త ప్లాన్‌!.. వివిధ కమిషన్లపై అధికారుల అధ్యయనం

నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని..
అయితే, రాత పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. నాలుగు మార్కులు కలపాలని ఆదేశించింది. దీంతో శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. వారు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు.  ఇదిలా ఉంటే.. గతేడాది ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను అక్టోబర్ 4న విడుదల చేసింది బోర్డు.

వివాదం ఇదీ!
మెయిన్స్ పరీక్షలో నాలుగు ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయలేదు. దీన్ని సింగిల్ బెంచ్ తప్పుపట్టింది. అందరికీ నాలుగు మార్కులు కలపాలని ఆదేశించింది. దీంతో ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.

నాలుగు వారాల్లో నియామకాలు పూర్తి:
మరో నాలుగు వారాల్లో ఈ నియామకాలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అక్టోబర్ లో ఫలితాలు విడుదల కాగా.. ఇప్పటివరకు ట్రైనింగ్ స్టార్ట్ కాకపోవడం, బోర్డు నుంచి ప్రకటన రాకపోవడంతో అభ్యర్థుల్లో ఇన్నాళ్లుగా టెన్షన్ నెలకొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం తుది ఫలితాలను విడుదల చేసిన వెంటనే ఎంపికైన వారికి శిక్షణను సైతం ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు