Pass Port : వారికి హైకోర్టు గుడ్ న్యూస్.. పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో సంచలన తీర్పు

క్రిమినల్ కేసులలో నిందితులుగా.. విచారణ ఎదుర్కుంటున్న వారి పాస్ పోర్ట్ రెన్యువల్ చేయడానికి పాస్ పోర్ట్ ఆఫీసులు నిరాకరిస్తాయి. మంచీర్యాలకు చెందిన వెంకటేశం ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించడంతో నిందితులకు ప్రాథమిక హక్కులు ఉంటాయని.. అతని పాస్ పోర్ట్ రెన్యువల్ చేయాలని ఆదేశించింది.

New Update
Pass Port : వారికి హైకోర్టు గుడ్ న్యూస్.. పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో సంచలన తీర్పు

Pass Port Renewal : పాస్ పోర్ట్.. ఇతర దేశాలకు వెళ్ళాలంటే పౌరుల ప్రాథమిక గుర్తింపు కార్డు. ఇది లేకుండా దేశం దాటడం కుదిరే పని కాదు. పాస్ పోర్ట్ ఉంటేనే వీసా వచ్చేది. వీసా అవసరం లేని దేశాలు కూడా పాస్ పోర్ట్ ఉంటేనే తమ దేశంలోకి రానిస్తాయి. అయితే, మన దేశంలో ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నవారికి పాస్ పోర్ట్ జారీ చేయరు. పాస్ పోర్ట్ జరీ చేసే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇక ఏదైనా క్రిమినల్ కేస్ లో ఇరుక్కుంటే.. ముందుగా పోలీసులు పాస్ పోర్ట్ స్వాధీనం చేసేసుకుంటారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఈ జాగ్రత్త తీసుకుంటారు. అయితే, పాస్ పోర్ట్(Pass Port) పోలీసుల వద్ద చిక్కుపడిన సమయంలో రెన్యువల్ కూడా నిలిపివేస్తున్నారు. అది సరికాదని.. క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన నేరస్తుడు కాదనీ.. నేరం రుజువు అయ్యేవరకూ నిందితుడుగా తన హక్కులు కాలరాయకూడదనీ.. పాస్ పోర్ట్ రెన్యువల్(Passport Renewal) చేయాలనీ కోరుతూ ఒక వ్యక్తీ హైకోర్ట్ ను ఆశ్రయించాడు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందో ముందు తెలుసుకుందాం.

మంచీర్యాలకు చెందినా రావికంటి వెంకటేశం ఒక చీటింగ్ కేసులో కోర్టు విచారణలో ఉన్నారు. ఈ సమయంలో తన పాస్ పోర్ట్ రెన్యువల్ చేయాలనీ జనవరి నెలలో పాస్ పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. దానిని పరిశీలించిన అధికారులు క్రిమినల్ కేసుతో ప్రమేయం ఉండడం వలన వెంకటేశం పాస్ పోర్ట్ రెన్యువల్ చేయడం కుదరని తేల్చి చెప్పేశారు. దీంతో వెంకటేశం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిబంధనలు న్యాయ విరుద్ధమని.. తన పాస్ పోర్ట్ రెన్యువల్ చేయాలనీ కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేసిన కోర్టు.. ఒక కేసులో నేరం రుజువు అయ్యే వరకూ చట్టం ఆ వ్యక్తీ నిందితుడే అనీ.. నిర్దోషిగానే చట్టం చూస్తుందనీ ప్రతి వ్యక్తికి, ప్రయాణాలు చేసే హక్కుతో పాటు పాస్ పోర్ట్ పొందే హక్కు కూడా ఉందని స్పష్టం చేసింది. గతంలో సుప్రీం కోర్టు కూడా ఇదే రకంగా చెప్పిందని న్యాయ మూర్తి పేర్కొన్నారు. పిటిషనర్ వెంకటేశం పాస్ పోర్ట్ దరఖాస్తును వరం రోజుల్లో ప్రాసెస్ చేయాలని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు.

Also Read: ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి ఆ మూడు రైళ్లు బంద్.. మళ్లీ ఎప్పుడంటే..

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నపుడు వ్యక్తికి ప్రయాణ హక్కుతోపాటు ప్రాథమిక స్వేచ్ఛల హక్కు ఉంటుంది. ప్రాథమిక హక్కులను గౌరవించడం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ ఈ తీర్పు చెప్పారు జస్టిస్ సూరేపల్లి నంద.

Watch this interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు