Big Breaking: తెలంగాణ సర్కార్ కు గవర్నర్ తమిళిసై మరో షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ

తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి కేసీఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వానికి ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు.

Big Breaking: తెలంగాణ సర్కార్ కు గవర్నర్ తమిళిసై మరో షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ
New Update

తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి కేసీఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వానికి ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు. రాజకీయ నేతలను సిఫార్సు చేయవద్దని ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ కు తమిళిసై సూచించారు. అర్హులను సిఫార్సు చేస్తే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. ఈ ఇద్దరు నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి కావాల్సిన సమాచారం లేదని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. నిబంధనల ప్రకారం.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడానికి అర్హత లేదన్నారు గవర్నర్. ఆర్టికల్ 171 (5) ప్రకారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రాజకీయ నేతలను సిఫార్సు చేయవద్దని ఈ సందర్భంగా తమిళిసై సూచించారు.

గతంతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తో కాస్త సఖ్యత కుదిరందన్న ఇటీవల పొలిటికల్స్ సర్కిల్స్ లో వ్యక్తమైంది. ఈ తరుణంలో గవర్నర్ తీసుకున్న తాజా నిర్ణయం సంచలనంగా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.

గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం, రాజ్ భవన్ ను మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. పూర్తి వివరాలతో మరో సారి ఈ ఇరువురు నేతల అభ్యర్థిత్వాలను ప్రభుత్వం సిఫార్సు చేస్తుందా? లేక కొత్త పేర్లను పంపిస్తుందా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

this is an updating story

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe