Cellars Ban: ఇకపై హైదరాబాద్‌లో సెల్లార్లకు నో పర్మిషన్?

హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్‌ కోసం చేపట్టే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వీటిపై ఫిర్యాదులు వస్తుండటంతోపాటు వర్షపునీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update
Cellars Ban

Cellars Ban: హైడ్రాతో హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలను తొలిగిస్తున్న తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని భారీ అంతస్థుల్లో ఉన్న సెల్లార్ల నిర్మాణాలకు ఎండ్ కార్డు వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం షాపింగ్ మాల్స్ లేదా పెద్ద ఎత్తున కట్టే అంతస్థులకు సెల్లార్లు ఖచ్చితంగా నిర్మాణాలు జరగాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ప్రభుత్వ ఆదేశలతో నూతనంగా నిర్మించే భారీ అంతస్థుల భవనాలకు సెల్లార్లను నిర్మాణం చేస్తున్నారు.

ఫిర్యాదులు రావడంతో...

ఈ సెల్లార్లపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తునట్లు సమాచారం. దీంతో పాటు సెల్లార్లకు వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలు పడిన సమయంలో మోటార్లతో నీటిని తోడాల్సి వస్తోంది. అలాగే వర్షపు నీరు సెల్లార్లకు చేరడంతో వాహనాలు మెకానిక్ షెడ్డుకు పరిమితం అవుతున్నాయి.

ప్రస్తుతం బహుళ అంతస్తుల నిర్మాణాల్లో అత్యధికంగా అయిదారు సెల్లార్ల వరకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇదే కాకుండా ఇళ్లల్లో సెల్లార్ల నిర్మాణానానికి వ్యయం అధికం అవుతోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెల్లార్ల నిర్మాణాలను అనుమతించవద్దని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు