Holiday: రేపు వీరికి సెలవు...తెలంగాణ సర్కార్ ప్రకటన..పూర్తివివరాలివే..!!

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి సందర్భంగా గురువారం సెలవు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే బంజారా కమ్యూనిటీ ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Telangana: యూనివర్సిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు
New Update

Holiday: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీన స్పెషల్ క్యాజువల్ సెలవుగా ప్రకటించింది. సేవాలాల్ జయంతి రోజు సెలవు ప్రకటించాలని లంబాడా సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన క్రమంలోనే క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం శాఖల్లో పనిచేసే బంజారా కమ్యూనిటీ ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాగఢ్ లో జన్మించారని బంజారాలు నమ్ముతుంటారు. ఆయన ఆధ్యాత్మిక గురువు. గొప్ప సంఘసంస్కర్త. జగదాంబకు అపరమైన భక్తుడు. బ్రహ్మచారి అయిన సేవాలల్...తన అద్వితీయ, అసామాన్య బోధనలతో కీర్తి ప్రతిష్టలు పొందారు.

బంజరాల హక్కులు, నిజాం, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్ సేవాలాల్ కీలకమైన పాత్ర పోషించారు. అంతేకాదు ఆంగ్లేయులు, ముస్లిం పాలకుల ప్రభావాలకు లోనవకుండా, ఇతర మతాల్లోకి బంజారాలు మారకుండా ఆయన ఎంతో క్రుషి చేశారు. అందుకే సేవాలాల్ బంజారాలకు ఆరాధ్యదైవమయ్యాడు. అసలు లిపి అంటూ లేని బంజారాల భాషకు ఒక రీతిని తీసుకువచ్చింది కూడా సేవాలాలే. కోట్లాది బంజారాలు, స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు, ఆచారా వ్యవహారాలను పాటిస్తూ..ఒకే భాషను మాట్లాడుతున్నారంటే అది సేవాలాల్ క్రుషి ఫలితమేనని బంజారాలు అంటున్నారు.

సేవాలాల్ జయంతి రోజు దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలు పండగ చేసుకుంటుంటారు. ర్యాలీలతోపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో వారి విజ్నప్తి మేరకు బంజారాల ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

ఇది కూడా  చదవండి: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

#holiday #banjara-community-employees #sevalal-maharaj-birth-anniversary
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe