TS: అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..! తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ అందజేస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. By Jyoshna Sappogula 16 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణలో అంగన్వాడీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున అందివ్వాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. Also Read: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..! హైదరాబాద్ రహమత్‌నగర్‌లో ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ అందిస్తామని తెలిపారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. #anganwadi-workers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి