BIG BREAKING: పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదా

మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ సర్కార్ నియమించింది. కేబినెట్ హోదాను సైతం కల్పించింది. గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

BIG BREAKING: పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదా
New Update

Pocharam Srinivas Reddy: బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. కేబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గుత్తా అమిత్ రెడ్డిని తెలంగాణ డెయిరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీలో సుధీర్ఘ కాలం పాలు కొనసాగిన పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో కేసీఆర్ ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు.
ఇది కూడా చదవండి: TG News: విగ్రహ వివాదం వేళ సచివాలయంలో ఆసక్తికర పరిణామం.. స్వయంగా రంగంలోకి సీఎం!
publive-image

2018లో రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ గా పని చేసే అవకాశం పోచారానికి దక్కింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి ఆయన బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే.. పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఆయనను కేబినెట్ హోదాతో సలహాదారుడిగా నియమించడంతో ఆ ప్రచారానికి ఇక బ్రేక్ పడనుంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయుడు, శాసనమండలి చైర్మన్ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కూడా తాజాగా కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరి నేతలకు పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం దక్కుతుందనే సంకేతాలను సీఎం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పొంగులేటి తెలంగాణ డీకే శివకుమార్.. బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు!


#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe