Telangana Elections: చివరికి తెలంగాణ ఎలక్షన్స్.. బీజేపీకి అడ్వాంటేజ్?

ఎన్నికల కమిషన్ ఈ రోజు మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూళ్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కన్నా చివరిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందన్న చర్చ సాగుతోంది.

New Update
Telangana Elections: మరో 25 రోజుల్లో నామినేషన్లు.. ఆ విషయంలో బీఆర్ఎస్ ముందంజ!

తెలంగాణలో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్స్ ను (Telangana Election Schedule) ఈ రోజు విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC). నవంబర్ 7వ తేదీన మిజోరాం, ఛత్తీస్ ఘడ్ ఫస్ట్‌ ఫేజ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్ ఘడ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు నవంబర్ 17న నిర్వహించనున్నారు. రాజస్థాన్ లో నవంబర్ 23న, తెలంగాణలో ఆఖరిగా నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే.. తెలంగాణ ఎన్నికలు చివరిగా జరగడం బీజేపీకి (BJP) కలిసివచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. 4 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు మకాం మార్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

అన్ని రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా తదితర ముఖ్య నేతలు తెలంగాణను చుట్టేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంకా ప్రధాని మోదీ సైతం పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: విడుదలైన షెడ్యూల్.. ఏ పార్టీ అభ్యర్థులెవరు? ప్రధాన పార్టీల్లో అయోమయం

తెలంగాణలో మూడు, నాలుగు కుదిరితే అంతకు మించి భారీ మీటింగ్ లను నిర్వహించే అవకాశం ఉంది. అగ్రనేతల వ్యూహాలు, ప్రచారంతో బీజేపీకి మంచి ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. మరో వైపు కావాలనే తెలంగాణలో ఎన్నికలు ఆలస్యంగా నిర్వహిస్తున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఇదిలా ఉంటే రేపు ఆదిలాబాద్ లో నిర్వహించనున్న జన గర్జన సభకు అమిత్ షా హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన ఎలాంటి వాఖ్యలు చేస్తారు? ఎలాంటి హామీలు ఇస్తారనే అంశం ఉత్కంఠగా మారింది.

Advertisment
తాజా కథనాలు