/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TS-Elections-2023-jpg.webp)
గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కౌంటింగ్ ముగియగానే క్యాంప్ నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ లోని హోటల్ తాజ్‌కృష్ణాలో 3 బస్సులు రెడీ చేసినట్లు సమాచారం. ఇదే హోటల్‌లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బస చేశారు.అభ్యర్థులు గెలిచిన వెంటనే హైదరాబాద్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో బెంగళూరుకు తరలించనున్నారు. ఇప్పటికే ప్రతీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓ ఇంఛార్జిని నియమించింది కాంగ్రెస్. వీరు కాంగ్రెస్ హైకమాండ్, అభ్యర్థుల మధ్య సమన్వయం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Election Counting 🔴 Live: తెలంగాణ బాద్‍షా ఎవరు..? కౌంటింగ్ లైవ్ అప్డేట్స్!