/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Priayanka-Gandhi-jpg.webp)
తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న హస్తం పార్టీ ప్రచారంపై ఫోకస్ పెంచింది. ఇందుకోసం అగ్రనేతలను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత రెండు రోజుల్లో మల్లిఖార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ లాంటి నేతలతో మీటింగ్ లు పెట్టిన కాంగ్రెస్.. రేపు ప్రియాంక గాంధీని రాష్ట్రానికి రప్పిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొల్లాపూర్ లో ఆమె పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రియాంక దేవరకద్రకు చేరుకుంటారు. అక్కడ మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. టీపీసీసీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వారికి వివరిస్తారు. తార్వాత 4.30 గంటలకు కొల్లాపూర్ లో నిర్వహించనున్న ప్రజా భేరి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రియాంక పర్యటనను విజయవంతం చేయడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేయడంపై దృష్టి సారించారు.