/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MCL-Kavitha-jpg.webp)
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC Kavitha) కవిత స్పృహ తప్పి కింద పడిపోయారు. జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయకల్ మండలం ఇటిక్యాలలో కవిత ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రచార వాహనంపై నిల్చున్న కవిత కళ్లు తిరిగి పడిపోయారు. బీపీ తగ్గిపోవడంతోనే ఆమె కింద పడిపోయినట్లు తెలుస్తోంది. సరిగా నిద్ర లేకపోవడం, ఎక్కువ సేపు ప్రచారంలో నిల్చోవడం కారణంగానే కవిత కళ్లు తిరిగి పడిపోయినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాసేపు విశ్రాంతి తర్వాత ఎమ్మెల్సీ కవిత తిరిగి ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది.