MLC Kavitha: కర్ణాటకలోనూ ఇదే డ్రామాతో కాంగ్రెస్ గెలుపు.. రాహుల్ గాంధీకి కవిత సంచలన సవాల్

కర్ణాటకలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బాండు పేపర్లు రాసి ప్రజలను నమ్మించి ఎన్నికల్లో నెగ్గారని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఇక్కడ సీనియర్ నేతలు కూడా అదే డ్రామాకు తెరతీశారని ఆరోపించారు.

MLC Kavitha: ఈ సారి నిజామాబాద్ నుంచి కాదు.. ఈ ఎంపీ ఎన్నికల్లో కవిత పోటీ ఎక్కడంటే?
New Update

కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాండ్ పేపర్ల పేరిట ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర రాజనరసింహా లాంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎంత విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో గెలవడానికి సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే డ్రామా చేసిందన్నారు. 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాశారన్నారు. కానీ, ఆ హామీల్లో వేటిని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Telangana Elections 2023:తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం…ఈరోజే లాస్ట్

కర్ణాటకలో మహిళలకు రూ. 2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇంకా మొదలుపెట్టలేదన్నారు. యువనిధి కింద ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయడం లేదని ధ్వజమెత్తారు. బియ్యం లేవని చెప్పి బియ్యం పథకాన్ని ప్రారంభించలేదని ఫైర్ అయ్యారు. కర్నాటకలో కాంగ్రెస్ నేతలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి... గెలిచిన తర్వాత బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారని ఆరోపించారు.

అక్కడి సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు సీనియర్ నేతలంతా ఇదే రకమైన డ్రామా చేశారన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిరుద్యోగంలో బీజేపీ పాలనలో ఉన్న హర్యాన నెంబర్ వన్ గా ఉందని, కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ రెండో స్థానంలో ఉందన్నారు. తెలంగాణ క‌న్నా ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన‌ట్లు నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటానని సవాల్ విసిరారు. లేకపోతే రాహుల్ గాంధీ మీరు కూడా రాజకీయాల నుండి త‌ప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

#telangana-elections-2023 #brs-mlc-kavitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe