Telangana Elections: పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..!

Telangana Elections: పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..!
New Update

Ponguleti Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఖమ్మం(Khammam) జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్(Congress) అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన తరఫున సోదరుడు ప్రసాద్ రెడ్డి పాలేరు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. అనుచరులతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటితో పాటు.. ఆయన అనుచరులైన పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గానికి, కోరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, పొంగులేటి నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇప్పుడు హైలెట్‌గా నిలుస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొత్తం ఆస్తి రూ. 440.23 కోట్లు ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Also Read: నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా?


పొంగులేటి అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు మీకోసం..

➠ 2019లో పొంగులేటి ఆదాయం రూ. 29. 47 లక్షలు.
➠ 2020లో ఏకంగా రూ. 12.60 కోట్లకు పెరిగిన ఆదాయం.
➠ 2023లో రూ. 32.07 లక్షలకు ఆదాయం పడిపోయింది.
➠ మూడేళ్లలో రూ. 12కోట్లకుపైగా ఆదాయాన్ని తగ్గించి చూపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
➠ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య మాధురి ఆదాయం రూ.3.4 కోట్లు.
➠ గతేడాదితో పోలిస్తే ఆయన భార్య ఆదాయం కూడా రూ. 63 లక్షలు తగ్గినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
➠ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హ్యాండ్ క్యాష్ రూ. 12.62 లక్షలు.
➠ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య దగ్గర హ్యాండ్ క్యాష్ రూ. 5.51 లక్షలు.
➠ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్యాంక్‌ అకౌంట్‌లో రూ. 2.46 కోట్లు ఉన్నాయి.
➠ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య అకౌంట్‌లో రూ.1.20 కోట్లు ఉన్నాయి.
➠ పొంగులేటి పేరు మీద రూ. 32.44 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
➠ పొంగులేటి భార్య పేరు మీద రూ. 364.51 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
➠ పొంగులేటి పేరు మీద రూ. 23.97 కోట్ల విలువచేసే ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.
➠ పొంగులేటి భార్య పేరు మీద రూ. 12.11 కోట్ల విలువ చేసే ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.
➠ పొంగులేటికి రూ. 4.22 కోట్ల అప్పులు ఉన్నాయి.
➠ పొంగులేటి భార్యకు రూ. 39.30 కోట్ల అప్పులు ఉన్నాయి.
➠ ఫంక్షన్ హాళ్లు, వ్యవసాయం, ఎంపీ పెన్షన్, వడ్డీల ద్వారా పొంగులేటికి ఆదాయం వస్తోంది.
➠ వ్యవసాయం, బిజినెస్‌, వడ్డీల ద్వారా పొంగులేటి భార్యకు ఆదాయం వస్తోంది.
➠ పొంగులేటి మొత్తం ఆస్తి రూ. 440.23 కోట్లు. పొంగులేటి మొత్తం అప్పు రూ. 43 కోట్ల అప్పు.

Also Readనాడు తండ్రులు.. నేడు తనయులు.. సాగర్‌ కా షేర్ ఎవరు?!

#ponguleti-srinivas-reddy #telangana-elections-2023 #ponguleti-srinivas-reddy-properties #khammmam #khammam-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి