కొత్తగూడెం: జలగం క్యాంప్ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు

ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి నగదు దొరకలేదని అధికారులు తెలిపారు.

New Update
కొత్తగూడెం: జలగం క్యాంప్ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారుల తనిఖీలు కలకలం సృష్టించాయి. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్ రావు (Jalagam Venkat Rao) క్యాంపు కార్యాలయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్‌ సోదాలు నిర్వహిహించింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ జలగంపై అధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. దాదాపు 30 నిమిషాల పాటు సోదాలు కొనసాగాయి. అయితే.. ఈ సోదాల్లో ఎలాంటి నగదు దొరకలేదని అధికారులు వెల్లడించారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..

Advertisment
తాజా కథనాలు