TS Elections: మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం.. ఆత్మసాక్షి, రాజనీతి సర్వేల లెక్కలివే!

రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరో సారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొడుతుందని తమ సర్వేల్లో తేలిందని ఆత్మసాక్షి, రాజనీతి సంస్థలు తెలిపాయి. ఆత్మసాక్షి సర్వే బీఆర్ఎస్ పార్టీకి 64-70 సీట్లు వస్తాయని తెలపగా.. రాజనీతి సర్వే మాత్రం 77 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

TS Elections: మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం.. ఆత్మసాక్షి, రాజనీతి సర్వేల లెక్కలివే!
New Update

తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించి మరో రెండు సర్వేలు (Telangana Election Survey) విడుదలయ్యాయి. ఆత్మసాక్షి, రాజనీతి సంస్థలు తమ సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేశాయి. ఈ రెండు సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మరో సారి అధికారంలోకి వస్తుందని తమ సర్వే ఫలితాల్లో తేల్చిచెప్పాయి. ఆత్మసాక్షి సంస్థ బీఆర్ఎస్ పార్టీ 64-70 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ (TS Congress) 37-43 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ 5-6 స్థానాల్లో, ఎంఐఎం 6-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. మరో 6 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తమ సర్వేలో తేలిందని ఆత్మ సాక్షి సంస్థ తెలిపింది.

ఇది కూడా చదవండి: Telangana Elections: 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్

గతంలో దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలతో పాటు కర్ణాటక ఎలక్షన్లలోనూ ఈ సంస్థ సర్వే ఫలితాలు నిజమయ్యాయి. దీంతో ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేపై చర్చ సాగుతోంది. మరో సంస్థ రాజనీతి కూడా తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ 77 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది.

కాంగ్రెస్ పార్టీ కేవలం 29 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ అసలు ఖాతా తెరిచే అవకాశమే లేదని స్పష్టం చేసింది రాజనీతి సంస్థ సర్వే. అయితే తాము 112 స్థానాల్లోనే సర్వే నిర్వహించినట్లు రాజనీతి సంస్థ తెలిపింది. మునుగోడుతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మరో 6 స్థానాల్లో సర్వే నిర్వహించాల్సి ఉందని వెల్లడించింది. రేపు సాయంత్రంలోగా ప్రతీ సీటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం వెల్లడించిన సర్వేకు సంబంధించిన నమూనాలను అక్టోబర్ 23 వరకు సేకరించినట్లు తెలిపింది.

#telangana-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe