TS Elections 2023: మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే.. టెన్షన్ పడకుండా ఇలా చేయండి!

మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే టెన్షన్‌ కూడా పడొద్దు. పోలింగ్‌ బూత్‌లోని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను కలవండి. జరిగింది చెప్పండి. కొన్ని క్రాస్ క్వశ్చన్స్‌ తర్వాత మీరు చెప్పింది నిజమేనని తేలుతుంది. అప్పుడు మీకు టెండర్‌ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. దొంగ ఓటును క్యాన్సిల్‌ చేస్తారు.

Lok Sabha Elections: ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు.. ఎక్కడంటే
New Update

సిరిసిల్ల జిల్లా దాచారంకు చెందిన విజయ్‌ పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లాడు. తన లైఫ్‌లో వెయ్యనున్న తన తొలి ఓటు ఇదే కావడంతో ఎంతో ఎక్సైటింగ్‌గా పోలింగ్‌ బూత్‌లోకి అడుగుపెట్టాడు. తొలిసారి ఓటు వేస్తున్నానన్న ఆనందం అతని కళ్లలో క్లియర్‌గా కనిపిస్తోంది. చెంగుచెంగున పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లిన విజయ్‌కు లోపలకు వెళ్లగానే షాక్‌ తగిలింది. తన పేరును స్ట్రైక్ చేసి ఉంచారు అక్కడి అధికారులు. ఇదేంటి నా పేరును ఎందుకు కొట్టేశారని అక్కడి అధికారులను అమాయకంగా ప్రశ్నించాడు. నువ్వు అల్రేడీ ఓటు వేశావ్‌గా అని అటు నుంచి సమాధానం వచ్చింది. అంతే ఉలిక్కిపడి నిద్రలేచాడు విజయ్‌. ఇదంతా కల. మొన్నే 20వ ఏటా అడుగుపెట్టిన విజయ్‌ తన తొలి ఓటు గురించి కలలు కంటూ నిద్రపోయాడు. అందుకే దానికి సంబంధించిన కలే వచ్చింది. అయితే అది మాముల కల కాదు.. పీడ కల.. తన ఓటు ఎవరో వెయ్యడం ఏంటి? విజయ్‌కు చెమటలు పట్టాయి. నిజంగానే ఇలా జరిగే అవకాశం ఉంది కదా అని అతనికి అనిపించింది. ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలన్నదానిపై ఆలోచించాడు. మీడ్‌నైట్‌ దాటడంతో ఈ టైమ్‌లో డాడీకి ఫోన్‌ చేసి డిస్టర్బ్‌ చేయడం ఎందుకులే అని అనుకున్నాడు. ఇంతలోనే బెడ్‌పక్కనే ఉన్న ఫోన్‌ కనపడింది. వెంటనే గూగుల్‌ తల్లి గుర్తొచ్చింది. నెట్‌ ఆన్‌ చేసి తన డౌట్‌ను టైప్‌ చేశాడు. వెంటనే గతంలో ఎన్నికల అధికారులు చెప్పిన విషయాలు అతనికి డిస్‌ప్లేపై కనపడ్డాయి. ఓసీ ఇంతనా అని నెట్‌ ఆఫ్‌ చేసి పడుకున్నాడు. ఇంతకీ ఎవరైనా మన ఓటు దొంగతనంగా వేస్తే ఏం చేయాలన్న డౌట్ మీక్కూడా ఉందా? అయితే ఇది తెలుసుకోండి.

Also Read: హమ్మయ్య క్లారిటీ వచ్చేసింది..టీమ్ ఇండియా కోచ్‌గా ద్రావిడ్ కొనసాగింపు

దొంగ ఓటుకు చెక్‌ పెట్టండిలా?
దొంగ ఓట్ల(Fraud Votes) పంచాయతీ ఈనాటిది కాదు.. తరతరాలుగా దొంగ ఓట్లు పోల్‌ అవుతున్నాయి. ఇది బహిరంగ నిజమే. అయితే గతంతో పోల్చితే చాలా వరకు తగ్గాయి. దొంగ ఓటు వెయ్యడం నేరం. కొన్నిసార్లు మనం పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లకపోముందే మన బదులు ఎవరో మన పేరు మీద ఓటు వేసేస్తుంటారు. అప్పుడు మన ఓటు దొంగలపాలైందని బాధపడొద్దు. ఇది పాటిస్తే మీరు ఓటు వెయ్యవచ్చు.

మీ ఓటు అప్పటికే ఎవరో వేసేసి ఉన్నట్లు పోలీంగ్‌ అధికారులు చెబితే టెన్షన్‌ పడవద్దు. కూల్‌గా ఒక నిమిషం ఊపిరిపీల్చుకుండి. ప్రతీ పోలింగ్‌ బూత్‌లోనూ ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఆ ఆఫీసర్‌ దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పండి. మీ ఐడీ ప్రూఫ్స్‌ ఎలాగో మీ దగ్గర ఉంటాయి. మీ వేలుపై సిరా గుర్తు కూడా ఎలాగో ఉండదు. ఈ ప్రాసెస్‌ ముగిసిన వెంటనే మీకు మళ్లీ ఓటు వేసే అవకాశం ఇస్తారు. దీన్నే టెండర్‌ ఓటు అంటారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈ ఓటునే పరిగణనలో తీసుకుంటారు. మీ బదులు ఎవరో వేసిన దొంగ ఓటును క్యాన్సిల్‌ చేస్తారు.

Also Read: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీ ఉద్యోగులకు సెలవు!

WATCH:

#telangana-elections-2023 #fraud-votes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe