Telangana Exit Polls: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ.. తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రజా తీర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. By Shiva.K 30 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Exit Polls: దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రజా తీర్పుపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఎగ్జిట్ పోల్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే సంస్థల ఫలితాలతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్‌కు మెజార్టీ మార్క్ దాటుతుందని కొన్ని సర్వే సంస్థలు చెబుతుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మరికొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ మరికాసేపట్లో వెల్లడికానున్నాయి. అయితే, రాజస్థాన్ ఫలితంపై భిన్నాభిప్రాయాలు వెల్లడించాయి సర్వే సంస్థలు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చి చెబుతున్నాయి మెజార్టీ సర్వే సంస్థలు. ఛత్తీస్‌ఘడ్‌లో తిరిగి కాంగ్రెస్ ప్రభత్వం ఏర్పాటవుతుందన్నది ఎగ్జిట్‌పోల్స్ అంచనా. మరి ఎగ్జిట్‌పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అవుతాయా లేదా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. Also Read: హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్! మాదే అధికారమంటున్న కేటీఆర్, రాహుల్ గాంధీలు #telangana-exit-polls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి