Sharmila: షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయింపు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు!

షర్మిల పార్టీ YSRTPకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. బైనాక్యులర్‌ గుర్తును ఫిక్స్‌ చేసింది. 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని షర్మిల ఇప్పటికే ప్రకటించారు.

Sharmila: షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయింపు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు!
New Update

షర్మిల పార్టీ YSRTPకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. బైనాక్యులర్‌ గుర్తును ఫిక్స్‌ చేసింది. 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి కాంగ్రెస్‌తో షర్మిల పార్టీ విలీనం అవుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. దీంతో మొత్తం 119 స్థానాల్లోనూ షర్మిల పార్టీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా షర్మిల పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకటే గుర్తు కేటాయించడం పట్ల వైటీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తన యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ)ని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఢిల్లీ వరకు షర్మిల వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ కోరినట్లుగా తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి ఓ వార్త సంస్థతో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇక దాదాపు నాలుగు నెలల పాటు తమ పార్టీ విలీనానికి ఎదురుచూసినా కాంగ్రెస్ నుంచి షర్మిలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్న టాక్‌ నడుస్తోంది. తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తొలి భారతీయ మహిళగా షర్మిల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చేరారు. కాంగ్రెస్‌లో విలీనానికి పూర్తిగా అంగీకరించారని.. అయినా రాష్ట్ర నాయకత్వం విలీనానికి అనుకూలంగా లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

కాంగ్రెస్ నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో YSRTP తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఇక ఎలాగైనా పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వస్తున్న షర్మిల మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రాంగమే ఇందుకు కారణమని సమాచారం. వైఎస్సార్ ఫ్యామిలీతో పొంగులేటికి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన 2014లో ఖమ్మం ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో చేరినా.. వైఎస్ ఫ్యామిలీకి మాత్రం ఆయన దూరం కాలేదు.

Also Read: అయోధ్య రామమందిరం వీడియో విడుదల.. ఓ లుక్కేయండి

#sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe