TS elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. బాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. మరోవైపు బీజేపీతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

TS elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?
New Update

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయటం లేదా? ఈ దఫా టీడీపీ పోటీ నుంచి వైదొలిగింది అంటూ కొన్ని సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం ప్రారంభించాయి. దీనిపైన పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కావాలనే కొందరు ఇటువంటి ప్రకటన చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

తెలంగాణలో 75 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేశామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇంతకు ముందు ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు కూడా. అదే సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించటంతో, టీడీపీ, జనసేన కలిసి తెలంగాణ ఎన్నికలకు వెళతాయని టీటీడీపీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు లోకేశ్‌ ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు పురందేశ్వరి, కిషన్ రెడ్డిలు కూడా ఉన్నారు. దీనితో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకు ఆస్కారం ఏర్పడవచ్చని.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తాయన్న ప్రచారం మొదలయ్యింది. తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. . జనసేనకు పన్నెండు సీట్లు కేటాయిస్తున్నట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి.

రెండు రోజుల క్రితం బీజేపీ తొలి జాబితా విడుదలయ్యింది. ఈ సమయంలోగానీ, ఆ తర్వాత గానీ బీజేపీగానీ, జనసేన గానీ పొత్తుకు సంబంధించిన ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. బీజేపీ, జనసేన మధ్య పొత్తులో ప్రతిష్ఠంభన ఏర్పడిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవటాన్ని బీజేపీకి ఆంగీకారయోగ్యం లేదన్న ప్రచారమూ సాగుతోంది.

అందులో వాస్తవం లేదు:
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం సాగుతోందని అన్నారు.

Also Read: తెలంగాణలో జనసేన-బీజేపీ పొత్తు.. అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీకి ముహూర్తం ఖరారు!

#telangana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe