తెలంగాణ(Telangana)లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) ప్రాంతానికి చెందిన 20 వేల మందికి పైగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఐతే వింతేముందంటారా..! వారంతా చనిపోయిన సంవత్సరాలు గడిచిపోయాయి. కొంతమంది 20 ఏళ్ల క్రితమే తెలంగాణ విడిచివెళ్లినప్పటికీ..తెలంగాణ ఓటర్ల జాబితాలో వారి పేర్లను సజీవంగా ఉన్నాయి. ఇటీవల రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో GHMC అధికారులు ఈ విషయాన్ని అంగీకరించారు. ఇలా చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వల్ల దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.
అధికారులకు చెప్పినా:
ఉదాహరణకు బహదూర్‌పురా నియోజకవర్గానికి రాగెల్లి ఫ్యామిలీలో 2021లో కోవిడ్ కారణంగా ముగ్గురు చనిపోయారు. ఐతే దూద్‌బౌలిలోని కస్తూర్బా బాలికల స్కూల్‌లో ఈ ముగ్గురు రాగెల్లి లలితమ్మ, మనోహర్ రాగెల్లి, రాధిక రాగెల్లి తుది ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదయ్యారని తెలిసి ఆ ఫ్యామిలీ షాక్ అయింది. 9 నెలల వ్యవధిలో తన తల్లిని, భార్యను, సోదరుడిని కోల్పోయానని చెప్పారు రాగెల్లి సంతోష్ కుమార్. వారంతా చనిపోయారని అధికారులకు చెప్పామని..ఓటర్ జాబితా నుంచి పేర్లను తొలగించాలంటున్నారు.
పేరుకుపోయిన పేర్లు:
ఇలాంటిదే మరో ఉదాహరణ బానూర్ ఫ్యామిలీది. 2020లోనే ఇంటిపెద్ద రాములు బానూర్ చనిపోయారు. మూడేళ్లు గడిచినప్పటికీ..ఓటర్ల జాబితా నుంచి ఆయన పేరు తొలగించలేదు. దీంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని షంషిగూడలోని జడ్పీ హైస్కూల్ ఓటరు జాబితాలో రాములు పేరు ఇప్పటికీ ఉంది. తన భర్త చనిపోయారని అధికారులకు ఎప్పుడో చెప్పామంటున్నారు రాములు భార్య. 2015-23 మధ్య నాంపల్లి నియోజకవర్గంలో GHMC రిజిస్ట్రీ ప్రకారం చనిపోయిన 7 వేల 767 మంది...ఇప్పటికీ ఓటరు జాబితాలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, ఎల్‌బీ నగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాలలోనూ 7 వేల 121 మంది చనిపోయిన ఓటర్లుగా గుర్తించారు. ఓటరు జాబితా నుంచి ఓటరు పేరును సమాచారం లేకుండా తొలగించడం నేరమని..దీనిని ఎవరూ తప్పుగా భావించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి. ఈ కారణంగానే ఓటరు లిస్టులో పేర్లు పేరుకుపోయాయని చెప్తున్నారు.
ALSO READ: అక్కడి నుంచి పోటీ చేస్తా.. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా.. షర్మిల సంచలన ప్రకటన!